ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్‌సింగ్ గడిచిన రెండు సంవత్సరాల పాలనలో సాధించింది ఏమీలేదని, ఆయన తమ ప్రశ్నలకు జవాబు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు.

గోదావరిఖని : రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్‌సింగ్ గడిచిన రెండు సంవత్సరాల పాలనలో సాధించింది ఏమీలేదని, ఆయన తమ ప్రశ్నలకు జవాబు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. మంగళవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో మక్కాన్‌సింగ్ తాను రెండుసార్లు ఓడిపోయానని కన్నీళ్లు పెట్టుకొని తనను గెలిపించాలని ప్రజలను కోరారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత చిరు వ్యాపారులను ఇబ్బందుల పాలు చేస్తూ వారికి సంబంధించిన దుకాణాలను కూల్చివేసి వారు కన్నీళ్లు పెట్టుకునే విధంగా ఏడిపిస్తున్నాడని ఆరోపించారు.
