ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మసాల(కే) పంచాయతీ పరిధిలోని దుబ్బగూడకు చెందిన కొడప సురేశ్-యశోద దంపతుల కుమారుడైన రాజేశ్‌కు పుట్టిక నుంచి రెండు కాళ్లు, చేతులు ముడుచుకుపోయాయి.

ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మసాల(కే) పంచాయతీ పరిధిలోని దుబ్బగూడకు చెందిన కొడప సురేశ్-యశోద దంపతుల కుమారుడైన రాజేశ్‌కు పుట్టిక నుంచి రెండు కాళ్లు, చేతులు ముడుచుకుపోయాయి. గ్రామంలోని ఫ్లోరైడ్ నీటిని తాగడం వల్ల తమ కొడుకు కాళ్లు, చేతులు పనిచేయడం లేదని తల్లిదండ్రులు అంటున్నారు. దవాఖానల్లో చూపించిన ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. వ్యవసాయం చేసుకుంటూ ఉపాధి పొందే తాము కాళ్లు, చేతులు పనిచేయకపోవడంతో ఇంటి వద్ద ఉంటూ కుమారుడి బాగోగులు చూసుకోవాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. గ్రామంలో పలువురు ఫ్లోరైడ్ నీరు తాగి నడుం, కాళ్లు, చేతుల సమస్యతో బాధపడుతున్నారు. రాజేశ్‌కు పింఛన్ కోసం ప్రయత్నాలు చెద్దామని ఆధార్ కార్డు కోసం వెళ్తే చేతి వేలిముద్రలు రాకపోవడంతో ఆధార్ తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పింఛన్ అయిన ఇప్పించాలని వేడుకున్నారు.
