
చైతన్యపురి, అక్టోబర్ 20 (శ్రీరామ్ చక్రీ న్యూస్): చైతన్యపురి డివిజన్ పరిధిలోని భవానీనగర్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాజీ కార్పొరేటర్ జిన్నారం విట్టల్ రెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కాలనీల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం మరింత పెరుగుతాయని తెలిపారు. దేవీ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు.
