తెలంగాణ ఏర్పాటు తర్వాత వైద్య విద్యపై తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో వైద్యుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని భావించారు. ఏటా కనీసం ఆరేడు వేల మంది విద్యార్థులు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే విద్యాభ్యాసం చేయాలని సంకల్పించారు.

ప్రతి కాలేజీకి బోధన, బోధనేతర సిబ్బందితోపాటు ఇతర పోస్టులను మంజూరు చేశారు. 2022 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తూ వచ్చారు. వాటికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణానికి సైతం భారీగా నిధులు మంజూరు చేశారు. అయితే, 2023 ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మారిపోయింది. అప్పటి నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇబ్బందుల్లో పడిపోయాయి. రెండున్నరేళ్ల కాలంలో ఎలాంటి మౌలిక వసతుల కల్పన లేదు. బోధనా సిబ్బంది నియామకం లేదు.
