ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. చెక్కపొట్టు లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు.. ప్రమాదవశాత్తు బొలెరోపై పడిపోయింది.

రాంపూర్-నైనిటాల్ హైవేపై పహాడి గేట్ సర్కిల్ వద్ద ఈ ప్రమాదం జరింగింది. ఈ మార్గంలో సాధారణంగానే చాలా రద్దీ ఉంటుంది. సరిగ్గా పహాడి గేట్ సర్కిల్ సిగ్నల్ వద్దకు రాగానే బొలెరో యూటర్న్ తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే, వెనకాలే వస్తున్న భారీ ట్రక్కును గమనించకుండానే బొలెరో డ్రైవర్ యూటర్న్‌కు ప్రయత్నించాడు. దాంతో ట్రక్కు డ్రైవర్ బొలెరెను ఢీకొట్టకుండా ఉండేందుకు ప్రయత్నించి సైడ్ తీసుకున్నాడు. ఈ క్రమంలో లారీ టైర్ డివైడర్‌ను ఢీకొట్టడంతో ట్రక్కు కంట్రోల్ తప్పి నేరుగ బొలెరోపై బోల్తా పడింది. బొలెరో పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. అందులోని డ్రైవర్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
