బీఎల్వోలు రాష్ట్ర వ్యాప్తంగా సక్రమంగా పని చేయటం లేదని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆరోపించారు.

హైదరాబాద్ : బీఎల్వోలు రాష్ట్ర వ్యాప్తంగా సక్రమంగా పని చేయటం లేదని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆరోపించారు. సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని వినోద్ కుమార్తో పాటు బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ ఎల్. రమణ, సోమా భరత్, కర్నె ప్రభాకర్, వై సతీష్ రెడ్డి, సుమిత్రానంద్ కలిశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఎస్.ఐ.ఆర్(SIR) ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున సీఈవోకు వినపతి పత్రం అందించామన్నారు. సర్ కోసం బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రత్యేక కమిటీ వేసింది.
