ప్రజాస్వామ్యంలో అన్యాయాలను ప్రశ్నించే హక్కు లేదా ? సింగరేణి లో కుంభకోణాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పం పుతారా ? అంటూ కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకుల ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ విప్ బాల్క సుమన్ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, నిరసన ర్యాలీలు చేపట్టారు

ఈ సందర్భంగా టీబీజీకేఎస్ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ మాట్లాడుతూ మాజీ విప్ బాల్క సుమన్ సింగరేణి ప్రస్తుత స్థితిగతులను వివరిస్తూ సింగరేణిలో పెద్ద ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని, నాయకులు, కార్యకర్తలను ఉత్తేజ పరిచే విధంగా వ్యాఖ్యలు చేశారే తప్ప ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగం చేయలేదన్నారు. కానీ బాల్క సుమన్ వ్యాఖ్యలను వక్రీకరించి కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుల మేరకు అక్రమంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపారని తెలిపారు
