
జనవరి :18 (శ్రీరాం చక్రి న్యూస్)
బాలాపూర్‌లో ధర్మరక్షణ సభకు ఏర్పాట్లు
మహేశ్వరం నియోజకవర్గం, బాలాపూర్ మండలంలోని గణేష్ చౌక్‌లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హిందూ ధర్మ లక్షణ – ధర్మరక్షణ సభను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సభ 2026 జనవరి 24 (శనివారం) మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు మాట్లాడుతూ, సమాజంలో ధార్మిక, సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. “జాగో భాగ్యనగర్ – చలో బాలాపూర్” అనే నినాదంతో సభకు భారీగా హాజరుకావాలని హిందూ బంధువులకు పిలుపునిచ్చారు.
భాగ్యనగర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఎదురవుతున్న వివిధ సమస్యలపై ఈ సభలో చర్చ జరుగుతుందని, ఐక్యతతో ముందుకు సాగితేనే పరిష్కారం సాధ్యమవుతుందని వారు అభిప్రాయపడ్డారు. దేశ భద్రత, చట్టపరమైన అంశాలపై తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి బాలాపూర్‌తో పాటు నగరవ్యాప్తంగా ఉన్న కోరుకుంటున్నారు .
