తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నూతన సంవత్సర వేడుకలు సంబురంగా జరిగాయి.

ఖమ్మం రూరల్ : ఖమ్మం జిల్లా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నూతన సంవత్సర వేడుకలు సంబురంగా జరిగాయి. ఖమ్మం నగరంలోని బాలల సదనంలో జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి టి సునీల్ రెడ్డి, కెవివి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ అనుద్దీపదుర్శెట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలల సదనంలోని పిల్లలతో కలిసి కలెక్టర్, అసోసియేషన్ నాయకులు కేక్ కట్ చేసి పిల్లలకు అందజేశారు
