నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా దోపిడీ దొంగలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.

వినాయక నగర్, జనవరి 02 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా దోపిడీ దొంగలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. గత వారం రోజులుగా జిల్లా కేంద్రంలో దోపిడీ దొంగలు విరుచుకుపడుతున్నారు. డిసెంబర్ 27వ తేదీన రెండు ఏటీఎం సెంటర్ లను దోచుకుపోయిన ఘటనలో పోలీసు బృందాలు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల అనంతరం మళ్లీ స్థానిక ఖలీల్ వాడి ప్రాంతంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం డ్యూటీ కి ఎదిరించిన మరో ఘటన వెలుగు చూసింది.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మళ్లీ తాజాగా దోపిడీ
