ఎన్నికలు జరుగుతున్నా పల్లె, పట్నం తేడా లేకుండా బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పారుతున్నది. ఎకడ చూసినా పర్మిట్ రూమ్, బార్లను తలపిస్తున్నాయి. గతంలో కోడ్ రాగానే బెల్టు దుకాణాలపై ఉకుపాదం మోపేవారు.

ఒకో గ్రామంలో 5 నుంచి 10 దుకాణాలు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో 82 వైన్స్ ఉండగా, 2000 వరకు బెల్టు షాపులు ఉన్నట్టు తెలిసింది. అయితే ఎన్నికల సమయంలో కోడ్ అమలులోకి రాగానే బెల్టు షాపులపై ఉకుపాదం మోపుతారు. కానీ స్థానిక సంస్థల ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చి వారం దాటినా అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
