తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై సినీనటుడు నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీలో మరో స్టూడియో నిర్మాణానికి బాలీవుడ్ ప్రముఖులు కలిసి ముందుకు రావడం మంచి పరిణామమని చెప్పుకొచ్చారు. అందరూ కలిసి వస్తే ప్రపంచ వ్యాప్త ఫెసిలిటీస్‌తో పెద్ద నిర్మాణం చేయొచ్చని నటుడు నాగార్జున పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ బాగుందని తెలిపారు.

హైదరాబాద్, డిసెంబరు 8 : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇవాళ(సోమవారం) నుంచి రెండు రోజులపాటు అత్యంత వైభవంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్వహిస్తోంది. అయితే, గ్లోబల్ సమ్మిట్‌లో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కారులో సమ్మిట్ వద్దకు వచ్చారు నటుడు అక్కినేని నాగార్జున. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.
