తమిళనాడులోని పళని సుబ్రమణ్య స్వామి దర్శనానికి వెళ్లిన ఓ తెలుగు భక్తుడిపై దాడి ఉద్రిక్తతకు దారితీసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ అయ్యప్ప స్వాములు ధర్నాకు దిగారు.

హైదరాబాద్: శబరిమల యాత్రలో భాగంగా తమిళనాడులోని పళని సుబ్రమణ్య స్వామి దర్శనానికి వెళ్లిన ఓ తెలుగు భక్తుడిపై దాడి ఉద్రిక్తతకు దారితీసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ అయ్యప్ప స్వాములు ధర్నాకు దిగారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అయ్యప్ప స్వాముల బృందం శబరిమల దర్శనానికి వెళ్తున్నది. ఈక్రమంలో మార్గమధ్యంలో పళనిలోని సుబ్రమణ్య స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఓ భక్తుడు సమీప దుకాణంలో వాటర్ బాటిల్, కూల్‌డ్రింక్స్ కొనుగోలు చేయడానికి వెళ్లారు. అయితే ఎంఆర్పీ రూ.30గా ఉండగా.. దుకాణుదారుడు రూ.40 డిమాండ్ చేశాడు. అదేంటని నిలదీయగా.. తమిళంలో తిట్టడం మొదలుపెట్టాడు. గాజు సీసాతో అయ్యప్ప భక్తుడిపై దాడి చేశాడు. దీంతో బాధితుడి తలకు తీవ్ర రక్తగాయమైంది.
