
హైదరాబాద్ న్యూస్ (శ్రీరామ్ చక్రి )12/5/2026,పేదల ఆరోగ్య భద్రతకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.ఈరోజు తుక్కుగూడ కార్యాలయంలో 50 మంది రోగులు, వారి కుటుంబ సభ్యులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య చికిత్స పొందిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక చేయూత అందిస్తున్నామని చెప్పారు.తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్థిక భారం అయినప్పటికీ, పేదల వైద్యానికి ఎంత ఖర్చయినా భరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని కేఎల్ఆర్ పేర్కొన్నారు.పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం సంతోషకరమని కాంగ్రెస్ నాయకులు, రోగుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు వేగంగా అందించేందుకు ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేసి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, రోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
