బీహార్లో సరికొత్త శ్రీవారి ఆలయాన్ని నిర్మించనున్నారు. దీని కోసం ఆ రాష్ట్ర సర్కారు భూమిని కేటాయించింది. పాట్నా సమీపంలో సుమారు 15 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు సీఎం సామ్రాట్ చౌదరీ తెలిపారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడు.. ఆ రాష్ట్ర సీఎంను కలిసి సన్మానించారు.

హైదరాబాద్: బీహార్లో సరికొత్త శ్రీవారి ఆలయాన్ని నిర్మించనున్నారు. దీని కోసం ఆ రాష్ట్ర సర్కారు భూమిని కేటాయించింది. పాట్నా సమీపంలో సుమారు 15 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు సీఎం సామ్రాట్ చౌదరీ తెలిపారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడు .. ఆ రాష్ట్ర సీఎంను కలిసి సన్మానించారు. సనాతన ధర్మ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడంలో భాగంగా బీహార్లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. టీటీడీ(TTD) ఛైర్మన్ బీఆర్. నాయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త దొరస్వామితో కలిసి బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు.
