బదిలీల ‘పంచాయితీ’ ముదిరి పాకాన పడింది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని కొందరు అధికారులు నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నప్పటికీ, తాజా బదిలీల్లో అక్కడి నుంచి కదలకపోవడం విమర్శలకు తావిస్తున్నది.

మంచిర్యాల జిల్లా పంచాయతీరాజ్‌శాఖలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగి ఒకరు బదిలీ నుంచి తప్పించుకునేందుకు తప్పుడు జాయినింగ్ రిపోర్టులు సమర్పించారన్న విమర్శలున్నాయి. గతంలో ఆదిలాబాద్ జిల్లాలో పనిచేసిన ఆ ఉద్యోగి బదిలీపై మంచిర్యాలకు వచ్చి పదోన్నతి పొందారు. నిబంధనల మేరకు నాలుగేళ్లు పని చేయడంతో తప్పనిసరిగా సదరు అధికారి బదిలీ కావాలి. కానీ, బదిలీ నుంచి తప్పించుకునేందుకు మంచిర్యాలలో 3 రోజులు ఆలస్యంగా జాయిన్ అయినట్టు తప్పుడు రిపోర్టు సమర్పించి, సదరు అధికారి బదిలీ నుంచి తప్పించుకున్నారని ఆ శాఖలో పనిచేసే ఇతర ఉద్యోగులే చెబుతున్నారు. అప్పుడున్న డీపీవో రిపోర్టుకు, సదరు ఉద్యోగి సమర్పించిన జాయినింగ్ రిపోర్టుకు సంబంధమే లేదు
