ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసం పట్ల నిరుద్యోగ యువత తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామంటూ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడంతో కాంగ్రెస్ సర్కారుపై నిరుద్యోగులు రగిలిపోతున్నారని అన్నారు.

ఖమ్మం సిటీ, మే 28: ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసం పట్ల నిరుద్యోగ యువత తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామంటూ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడంతో కాంగ్రెస్ సర్కారుపై నిరుద్యోగులు రగిలిపోతున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే విద్యార్థులు, నిరుద్యోగుల కోసం బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి రూపొందించిన ‘రాకేశ్‌రెడ్డి ఈ-క్లాస్‌రూం’ యాప్‌ను ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, పలువురు నాయకులతో కలిసి అజయ్‌కుమార్ గురువారం ప్రారంభి
