నిజామాబాద్ జిల్లా జైలులో గంజాయి దొరికిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. జైలర్ ఉపేందర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మరో జైలర్ సాయి సురేశ్‌ను ఆదిలాబాద్‌కు బదిలీ చేశారు.

నిజామాబాద్ జిల్లా జైలులో గంజాయి దొరికిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. జైలులో డ్రగ్స్‌తో పాటు ఇతర మత్తు పదార్థాలు సరఫరా అవుతుందన్న ఆరోపణలపై జైళ్ల శాఖ డీఐజీ, ఐజీ పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. ఈ విచారణ నివేదిక ఆధారంగా జైలర్ ఉపేందర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మరో జైలర్ సాయి సురేశ్‌ను ఆదిలాబాద్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే సూపరింటెండెంట్ దశరథాన్ని నెల రోజులు సెలవులపై వెళ్లాలని ఆదేశించారు.
