
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని నాన్కరంఘూడ సమీపంలో శనివారం ఉదయం ఒక ఐ20 కారు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. కారు లో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అప్రమత్తమై సమయానికి బయటకు దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం. మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దహనం అయ్యింది. సమాచారం అందుకున్న ఔటర్ రింగ్ రోడ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది.
నార్సింగి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మంటలకు షార్ట్ సర్క్యూట్ తప్ప మరే ఇతర కారణాలున్నాయా అన్న దానిపై కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
