సంగారెడ్డి జిల్లా ముత్తంగి వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులో శుక్రవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి

సంగారెడ్డి జిల్లా అక్టోబర్ 24 ( శ్రీరాం చక్రీ న్యూస్ ) వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులో శుక్రవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ రోడ్డుపై ప్రయాణిస్తున్న బీఆర్ఎస్ నాయకుడు మాణిక్‌యాదవ్ డ్రైవర్‌ను నిలువరించడంతో అందరూ సురక్షితంగా కిందికి దిగారు. సిద్దిపేట్ నుంచి శంకర్పల్లి వెళ్లేందుకు ఆరుగురితో వస్తున్న కారు ముత్తంగి ఓఆర్ఆర్ జంక్షన్ సమీపంలోకి రాగానే అగ్నిప్రమాదానికి గురైంది.
