తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది.

గాలివాన బీభత్సం కారణంగా ఏపీలో ఇద్దరు, తెలంగాణలో ఒకరు మృత్యువాత పడ్డారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం గోవిందాయిపల్లిలో పిడుగుపాటుకు ఒక గొర్రెల కాపరి మృతిచెందాడు. అచ్చంపేటలో భారీ వర్షం కారణంగా ధాన్యం తడిసిపోయింది.
గాలుల ప్రభావంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. మామిడి, అరటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాకినాడ జిల్లా తుని ప్రాంతంలో భారీ ఈదురుగాలులకు తలుపులమ్మ తల్లి ఆలయ మార్గంలో కారుపై చెట్లు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు.
