మీర్పేట్ చౌరస్తా, సెప్టెంబర్ 17:భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, మిర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మిర్పేట్ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరం మీర్పేట్ మున్సిపల్ అధ్యక్షుడు బిక్షపతి చారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారుఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరామ్ యాదవ్, బీజేపీ జనరల్ సెక్రటరీ తిరుపతిరెడ్డి, రవి నాయక్, అజయ్, నీలా రవి నాయక్, విజయలక్ష్మి రాజు, అర్పిత చారి, రవీందర్ రెడ్డి వంటి ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వారు రక్తదానానికి ముందుకొచ్చిన యువతను అభినందించారు.శిబిరానికి పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, స్థానిక యువత హాజరై రక్తదానంతో మానవతా సేవకు తమవంతు పాత్ర పోషించారు.బిక్షపతి చారి మాట్లాడుతూ, “ప్రధాని మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం గర్వకారణమని,” అన్నారు. రక్తదానం చేయడం వల్ల ప్రాణాలను కాపాడే గొప్ప అవకాశం దక్కుతుందని ఆయన తెలిపారు.
మీర్పేట్ చౌరస్తా, సెప్టెంబర్ 17:
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, మిర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మిర్పేట్ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరం మీర్పేట్ మున్సిపల్ అధ్యక్షుడు బిక్షపతి చారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు
ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరామ్ యాదవ్, బీజేపీ జనరల్ సెక్రటరీ తిరుపతిరెడ్డి, రవి నాయక్, అజయ్, నీలా రవి నాయక్, విజయలక్ష్మి రాజు, అర్పిత చారి, రవీందర్ రెడ్డి వంటి ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వారు రక్తదానానికి ముందుకొచ్చిన యువతను అభినందించారు.
శిబిరానికి పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, స్థానిక యువత హాజరై రక్తదానంతో మానవతా సేవకు తమవంతు పాత్ర పోషించారు.
బిక్షపతి చారి మాట్లాడుతూ, “ప్రధాని మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం గర్వకారణమని,” అన్నారు. రక్తదానం చేయడం వల్ల ప్రాణాలను కాపాడే గొప్ప అవకాశం దక్కుతుందని ఆయన తెలిపారు.


