నిర్మల్ జిల్లాలో ధాన్యం నిల్వ చేసేందుకు మరిన్ని స్థలాలు సమకూర్చుకోవాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా అన్నారు. నిర్మల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.

ర్మల్ చైన్‌గేట్, మే 19 : నిర్మల్ జిల్లాలో ధాన్యం నిల్వ చేసేందుకు మరిన్ని స్థలాలు సమకూర్చుకోవాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా అన్నారు. నిర్మల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వెంటవెంటనే గోదాములకు తరలించాలన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యగా అదనంగా ధాన్యం నిల్వ చేయడానికి అవకాశం ఉన్న ప్రదేశాలు సమకూర్చుకోవాలన్నారు. నిరంతరాయంగా తరలింపునకు అనుగుణంగా తగినన్ని లారీలు, హమాలీలు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, పౌరసరఫరాల అధికారులు రాజేందర్, సుధాకర్, డీఎం మార్క్‌ఫెడ్ మహేశ్, డీఆర్డీవో విజయలక్ష్మి, జడ్పీ సీఈవో భాగ్యలక్ష్మి, డీపీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
