థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దులో మరోసారి ఘర్షణలు భగ్గుమన్నాయి.

థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దులో మరోసారి ఘర్షణలు భగ్గుమన్నాయి. ఉబోన్ రాట్చథాని ప్రావిన్స్‌లో థాయ్ దళాలపై కంబోడియా దళాలు కాల్పులు జరిపారు. దీంతో థాయ్ సైన్యం వైమానిక దాడులకు దిగింది. కంబోడియా పోస్టులు, ఆయుధ డిపోలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించారు. ఈ క్రమంలో సరిహద్దుల్లో మరోసారి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఓ థాయ్ సైనికుడు మృతి చెందినట్లు థాయ్ సైన్యం వెల్లడించింది.
