పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లోని మిల్లులకు ధాన్యం అక్రమంగా తరలివస్తున్నది.

మిర్యాలగూడ, ఏప్రిల్ 7: పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లోని మిల్లులకు ధాన్యం అక్రమంగా తరలివస్తున్నది. నిత్యం వందలాది వాహనాల్లో సన్న ధాన్యం వస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఫలితంగా తెలంగాణ ధాన్యం ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొరుగు రాష్ట్రం నుంచి ధాన్యం తరలివస్తున్నా ఇక్కడి అధికారులు ఏం చేస్తున్నారంటూ స్థానిక రైతులు మండిపడుతున్నారు. ఏపీలోని కర్నూలు, కృష్ణ, గుంటూరు జిల్లాల నుంచి తెలంగాణలోని మిర్యాలగూడకు రోజుకు సుమారు 500 డీసీఎంల ద్వారా ధాన్యం తరలివస్తున్నది. ఆంధ్రా నుంచి తక్కువ ధరకే ధాన్యాన్ని మి ల్లుల వద్దకు చేరుస్తున్నారు.
