దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి.
దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలోని పలు ప్రైవేట్ పాఠశాలలకు శుక్రవారం ఉదయం బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు ఆయా పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు.

ద్వారకా సెక్టార్ 16లోని ఆంధ్రాస్కూల్, సీఆర్పీఎఫ్ స్కూల్, నజాఫ్గఢ్లోని సంత్ దర్శన్ పబ్లిక్ స్కూల్, గోయిలా డెయిరీలోని శాంతి జ్ఞాన్ నికేతన్ స్కూల్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. పాఠశాలల ప్రాంగణాల్లో పేలుడు పదార్థాలను అమర్చినట్లు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్స్ పంపారు. అప్రమత్తమైన పాఠశాలల యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు
