దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంది.

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయిలో 400కిపైనే నమోదవుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. నగరంలో తీవ్ర కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో అవుట్డోర్ కార్యకలాపాలపై నిషేధం విధించింది. రాజధాని అంతటా కాలుష్యం తీవ్రస్థాయిలో ఉండటంతో పాఠశాలల్లో అవుట్డోర్ కార్యకలాపాలు , గేమ్స్‌ను నిలిపివేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది.
