జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి శివారులోని వానకొండయ్య గుట్టపై జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను తక్షణమే నిలిపివేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో గ్రామస్తులు, బీఆర్ఎస్ ప్రతినిధులు గురువారం జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు వినతిపత్రం అందజేశారు

జనగామ, మే 21 (నమస్తే తెలంగాణ) : జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి శివారులోని వానకొండయ్య గుట్టపై జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను తక్షణమే నిలిపివేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో గ్రామస్తులు, బీఆర్ఎస్ ప్రతినిధులు గురువారం జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు వినతిపత్రం అందజేశారు. కడవెండి గ్రామస్తులు, వానకొండయ్య గుట్ట పరిసర తండాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, భక్తులు గుట్టపై జరుగుతున్న అక్రమ మైనింగ్‌కు సంబంధించిన ఆధారాలను ఫొటోలతో సహా చూపించారు.
