జగిత్యాల జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల రిజర్వేషన్లను కలెక్టర్ బీ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం ప్రకటించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లను కౌన్సిలర్ పదవులకు రిజర్వేషన్లు ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ కేటగిరీల వారిగా ఖరారు చేశారు.

ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ బీ సత్యప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా మున్సిపాలిటీల రిజర్వేషన్ లు ఖరారు చేశామని, మహిళా రిజర్వేషన్ లు డ్రా పద్ధతి ద్వారా ఖరారు చేశామని తెలిపారు.
