పాలేరు మాజీ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత కందాల ఉపేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను పొందాల అభిమానులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఒకరోజు ముందుగానే ఘనంగా నిర్వహించారు.

ఖమ్మం రూరల్ : పాలేరు మాజీ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత కందాల ఉపేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను పొందాల అభిమానులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఒకరోజు ముందుగానే ఘనంగా నిర్వహించారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 22వ 26వ డివిజన్ తో పాటు మద్దులపల్లి లో సైతం పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తొలుత 22వ డివిజన్ సాయి గణేష్ నగర్ లోని కందాల క్యాంపు కార్యాలయంలో కందాల యూత్ ఆధ్వర్యంలో తల సేమియా వ్యాధిగ్రస్త పిల్లలకు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.
