అధికార పార్టీ కాంగ్రెస్తో పాటు బీజేపీ నుంచి కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో గులాబీ గూటికీ చేరుతుండగా, ఆ పార్టీల ఉనికి లేకుండా పోతున్నది.

ప్రతి రోజూ ఏదో ఒక గ్రామం నుంచి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తప్ప ఇతర పార్టీల అభ్యర్థులు గెలుపొందే అవకాశాలు తక్కువగా ఉండటం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలనలో వైఫల్యం చెందడంతో సాధారణ ప్రజలతో పాటు వివిధ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో గులాబీ పార్టీలోకి వలస వస్తున్నారు. ప్రధానంగా సిర్పూర్ నియోజకవర్గంలో రెండేళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరుగకపోవడం, సంక్షేమ పథకాలు అమలు కాకపోవడంతో సహజంగానే అధికార పార్టీపై ప్రజలు, యువతలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది
