తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో పని చేస్తున్న 14 కళాశాలలను విభజిస్తూ సర్కారు నిర్ణయం తీసుకున్నది. దీంతో గిరిజన సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉట్నూర్, మే 26 : తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో పని చేస్తున్న 14 కళాశాలలను విభజిస్తూ సర్కారు నిర్ణయం తీసుకున్నది. దీంతో గిరిజన సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గిరిజనులు విద్యకు దూరమవుతున్నారని, పాఠశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు మళ్లీ కళాశాలలో చేరకుండా ఉండే అవకాశాలు ఏర్పడతాయని వారు పేర్కొంటున్నారు. అదే పాఠశాలలో కళాశాలలు విలీనమై ఉంటే ఇంటర్మీడియట్ వరకు విద్యను అభ్యసిస్తారని తెలుపుతున్నారు. ఇందులో భాగంగా పాఠశాలలోనే కొనసాగించాలని ఉట్నూర్ ఐటీడీఏ పీవోకు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు.
