ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగానూ రిటైల్ ఒక్క గుడ్డు ధర రూ.7లకు చేరింది. వారంగా రోజుకు రూ.20 పైసల నుంచి రూ.30 పైసల చొప్పున ధర పెరుగుతూ వచ్చింది.

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగానూ రిటైల్ ఒక్క గుడ్డు ధర రూ.7లకు చేరింది. వారంగా రోజుకు రూ.20 పైసల నుంచి రూ.30 పైసల చొప్పున ధర పెరుగుతూ వచ్చింది. ఆదివారం ధరలను చూస్తే వంద గుడ్లకు రూ.615 పలుకుతున్నది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బహిరంగ మార్కెట్లోనూ, కిరాణ దుకాణాల్లో గుడ్డును రూ.7లకు అమ్మాల్సి వస్తుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే కార్తీక మాసంలో గుడ్డు వినియోగం తక్కువగా ఉన్నప్పటికీ ధర పెరగడం పరిపాటిగా మారిందని చెప్పొచ్చు.
