కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఏది కొందామన్నా పిరం పలుకుతున్నాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతున్నది.

కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఏది కొందామన్నా పిరం పలుకుతున్నాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతున్నది. యేటా కార్తీక మాసంలో కూరగాయల ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. దీనికితోడు ఈ వానకాలంలో భారీ వర్షాలు కురియడంతో చాలా చోట్ల కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి.
