బోథ్ మార్కెట్ యార్డుకు జొన్నలు అమ్మకానికి తెచ్చిన రైతులు ఆగమయ్యారు. సోమవారం సుమారు అరగంటపాటు కురిసిన వర్షంతో యార్డులో నీళ్లు నిలవడంతో ఇబ్బందులు పడ్డారు. పలువురి రైతులకు చెందిన జొన్న బస్తాలు వర్షానికి తడిసి పోయాయి.

సిరికొండ మండల కేంద్రంలో సోమవారం కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. మండలంలోని పొన్న, సిరికొండ ఆయా గ్రామాలకు చెందిన రైతుల కుప్పలు ఉన్నాయి. మార్కెట్ యార్డు లేకపోవడంతో వర్షానికి జొన్న తడిచిపోతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మండల కేంద్రంలోనే మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. సిరికొండ మండల సొసైటీ డైరెక్టర్ రాజన్న మార్కెట్ యార్డును సందర్శించారు. త్వరగా కొనుగోలు పూర్తి చేయాలని కోరారు
