కర్నూలు బస్సు ప్రమాదం ఘటనపై సమగ్ర విచారణకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు

కర్నూలు బస్సు ప్రమాదం ఘటనపై సమగ్ర విచారణకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం కావడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుబాయ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. బస్సు ప్రమాదం గురించి తెలియగానే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. మృతుల వివరాలు గుర్తించి కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని ఆదేశించారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు.
