కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో మక్క రైతులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. మార్కెట్కు వచ్చి 20 రోజులైనా కొనుగోలు చేసే దిక్కు లేక ఆందోళన బాట పట్టారు.

ముకరంపుర, మే 25: కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో మక్క రైతులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. మార్కెట్కు వచ్చి 20 రోజులైనా కొనుగోలు చేసే దిక్కు లేక ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ మార్కెట్ కమిటీ మెయిన్ గేట్ ఎదుట బైఠాయించారు. మార్కెట్కు వచ్చే మామిడి రైతులు, కొనుగోలుదారులు, వ్యాపారులు లోపలికి రాకుండా మార్కెట్ కమిటీ మెయిన్ గేట్ మూసివేశారు. దీంతో మార్కెట్ ప్రధాన ద్వారం ముందు రద్దీ ఏర్పడి భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
