దోపిడీ కోసం ఏకంగా ప్రత్యేక యాప్‌ను రూపొందించి దాని ద్వారా దొంగతనాలు చేస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసులో ప్రత్యేక యాప్ ద్వారానే దోపిడీకి పక్కా ప్రణాళికను రూపొందించారని తెలిసింది.

కరీంనగర్ రాంనగర్/ విద్యానగర్, మే 14 : దోపిడీ కోసం ఏకంగా ప్రత్యేక యాప్‌ను రూపొందించి దాని ద్వారా దొంగతనాలు చేస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసులో ప్రత్యేక యాప్ ద్వారానే దోపిడీకి పక్కా ప్రణాళికను రూపొందించారని తెలిసింది. ఎట్టకేలకు పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసును కరీంనగర్ పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులతోపాటు సిమ్‌కార్డులు విక్రయించిన సహాయకుడిని అరెస్ట్ చేశారు. గురువారం కరీంనగర్లో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అరెస్ట్ వివరాలను వెల్లడించారు.
