ఏడీ శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నది. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆరు బృందాలతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నది. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆరు బృందాలతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. రాయ్దుర్గ మై హోమ్ భుజ, బాలానగర్, రంగారెడ్డి కలెక్టరేట్ తోపాటు జిల్లాలో ఆరు చోట్ల సోదాలు చేస్తున్నారు. శ్రీనివాస్ సోదరుడు, బంధువులు ఇండ్లలో తనిఖీలు చేస్తున్నారు.
