సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తికి మద్దతు ధర లభిస్తుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణరావు అన్నారు.

పెద్దపల్లి మండలంలోని నిమ్మనపల్లిలో గల మహాలక్ష్మి జిన్నింగ్ మిల్లులో గురువారం సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిన్నింగ్ మిల్ యాజమాన్యంతో కలిసి ఆయన ప్రారంభించారు. రైతు కలవేన మల్లేశంకు చెందిన 27.80 క్వింటాళ్ల పత్తిని మొదట కోనుగోలు చేశారు.
