ప్రభుత్వ భూములకు ఆర్రాస్ పాడుతూనే ఉంది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ భూముల వేలం నోటిఫికేషన్ చూస్తే… ఆదాయంపై ఉన్న యావ, సామాన్యుడిపై అవసరాలను గుర్తించడం లేదని తేలిపోతుంది.

హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ భూముల వేలం నోటిఫికేషన్ చూస్తే… ఆదాయంపై ఉన్న యావ, సామాన్యుడిపై అవసరాలను గుర్తించడం లేదని తేలిపోతుంది. ఓవైపు భూముల ధరలు పెంచడం, మరోవైపు ఉన్న భూములను వేల కోట్లకు విక్రయించడంతో సొంతింటి కల మరింత భారంగా మారస్తోంది. ఈ నగరంలోని 8 ల్యాండ్ పార్శిళ్లు, 168 ఓపెన్ ప్లాట్లను వేలానికి పెట్టి, రియల్ ఎస్టేట్ వ్యాపారి తరహాలో ధరల దందాకు తెరలేపింది. కేవలం హకీంపేటలోని 8.25 ఎకరాల భూమిని ఏకంగా రూ. 1000 కోట్లు వసూలు చేయాలని చూస్తున్నది.
