ధన్వాడ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యింది. వ్యతిరేక పోరాట కమిటీ చేసిన ఉద్యమాల ఫలితంగా కంపెనీ రద్దు కావడంతో స్థానికుల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది

కాలుష్య భూతం, పచ్చని పొలాల్లో చిచ్చు రేపే రూ.200 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని పలు గ్రామాల ప్రజలు ఆత్మస్థర్యంతో సైనికుల్లాగా చేసిన పోరాటాలు ఫలించాయి. విజయం ముమ్మాటికీ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ముందుకు సాగిన పరిసర గ్రామాల వాసులదే.. అందుకు సహకరించిన నాయకులకు, మీడియాకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
