ఇండిగో సంక్షోభం పై అత్యవసర విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తిరస్కరించింది.

సుప్రీంకోర్టు ;ఇండిగో సంక్షోభం పై అత్యవసర విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇండిగో సంక్షోభంపై ప్రస్తుతానికి ఎలాంటి జోక్యం చేసుకోబోమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ‘ఇండిగో విమానాల రద్దు తీవ్రమైన సమస్యే. లక్షలాది మంది ప్రయాణికుల అవస్థలను మేము అర్థం చేసుకున్నాము. అయితే, ఈ సమస్యపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టి సారించింది. సకాలంలో చర్యలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో మాకు ఎలాంటి అత్యవసర పరిస్థితి కనిపించడం లేదు. ఇండిగో సంక్షోభంపై ప్రస్తుతానికి ఎలాంటి జోక్యం చేసుకోబోము’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.
