ప్రయాణికుల సౌకర్యం కోసం కోట్లు ఖర్చుచేసి దుబ్బాకలో బస్టాండ్ భవనాన్ని నిర్మిస్తే అధికారుల నిర్లక్ష్యం కారణంగా అపరిశుభ్రంగా మారిందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్టాండ్‌ను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

దుబ్బాక, జూన్ 29: ప్రయాణికుల సౌకర్యం కోసం కోట్లు ఖర్చుచేసి దుబ్బాకలో బస్టాండ్ భవనాన్ని నిర్మిస్తే అధికారుల నిర్లక్ష్యం కారణంగా అపరిశుభ్రంగా మారిందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్టాండ్‌ను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మరుగుదొడ్లు, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, ఆవరణలో ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు ఉండటంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
