పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో అభ్యర్థులకు సందేహాలు రేకెత్తించకుండా అధికారులు స్పష్టతతో వ్యవహరించాలని నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి ఆదేశించారు.

పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో అభ్యర్థులకు సందేహాలు రేకెత్తించకుండా అధికారులు స్పష్టతతో వ్యవహరించాలని నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి ఆదేశించారు. గురువారం మెదక్ జిల్లా శివ్వంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద నామినేషన్ కౌంటర్లను రెండవ రోజు ఆర్డీఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థికి సంబంధించిన రిజర్వేషన్ సరైనదో కాదో, అలాగే కుల ధృవీకరణ పత్రం, ఇంటి పన్ను రసీదు, ఆధార్ కార్డు పరిశీలిస్తే చాలు అన్నారు.
