వానకాలం సమీపిస్తుండడంతో రైతులు తమ భూముల్లోని పంట వ్యర్థాలకు నిప్పు పెడుతున్నారు. దీంతో మంటలు వేగంగా సమీప పొలాల్లోకి వ్యాపించి వ్యవసాయ సామగ్రి, పంటలు నష్టపోతున్నారు. మంటలు, పొగతో చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అందులో భాగంగా పొలాల్లో ఉన్న వరి కొయ్యలు, మక్కజొన్న చొప్ప వంటి వ్యర్ధాలకు నిప్పంటిస్తున్నారు. గత రెండు నెలల వ్యవధిలో ఇలా నిప్పు పెట్టడం వల్ల ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. సమీప పొలాల్లో ఉన్న వరి, మక్కజొన్నతో పాటు జామాయిల్, పామాయిల్, మామిడి తదితర పంటలు వందల ఎకరాల్లో దగ్ధమయ్యాయి. విద్యుత్ మోటర్లు, స్టార్టర్లు, పైపులు, ట్రాన్స్ఫార్మర్లు వంటివి కాలి బూడిదై తీవ్ర నష్టం వాటిల్లింది. ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో మంటల్లో చిక్కుకొని ఓ రైతు మృతి చెందగా, పొగతో ఊపిరాడక అతడి భార్య సైతం మరణించింది. అలాగే ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పొగ కారణంగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో తల్లీ కూతుర్లు మృతిచెందగా, మరొకరు గాయాలతో చికిత్స పొందుతున్నా
