మృగశిర కార్తె ప్రవేశించడంతో పాటు తొలకరి వర్షం కూడా పలకరించడంతో వానాకాలం సాగు కోసం రైతులు సమాయాత్తమవుతున్నారు.

మృగశిర కార్తె ప్రవేశించడంతో పాటు తొలకరి వర్షం కూడా పలకరించడంతో వానాకాలం సాగు కోసం రైతులు సమాయాత్తమవుతున్నారు. ఈ మేరకు దుక్కులు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. పంటల సాగుకు విత్తన ఎంపికే కీలకం. ఏ పంటైనా అధిక దిగుబడి రావాలంటే నాణ్యత కలిగిన మేలు రకం విత్తనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సీజనలో రైతుల కోసం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ(టీజీ సీడ్స్) వివిధ రకాలైన వరి, అపరాలు, పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులోకి తెచ్చింది. ఉమ్మడి జిల్లాలోని రైతులకు అవసరమైన మేరకు నాణ్యమైన మేలు రకం విత్తనాలను అందించేందుకు ఏర్పాటు చేసింది
