
హైదరాబాద్: (శ్రీరామ్ చక్రి న్యూస్),2/5/2026,బహుజనుల సాధికారత లక్ష్యంగా పనిచేస్తున్న BCY పార్టీలో భారీ చేరికలు చోటుచేసుకున్నాయి. కర్మన్ఘాట్ ధ్యానాంజనేయ స్వామి దేవాలయ మాజీ ధర్మకర్త నారగోని శ్రీనివాస్ యాదవ్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
BCY పార్టీ PAC సభ్యులు డా. చిలకల శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో, GHMC కన్వీనర్ తేజో విజయకుమారి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పార్టీలో చేరారు. రావి నర్సింహ, మేకల వివేక్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.
నారగోని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో అడెపు బిక్షపతి, అముదల రఘు, గొల్ల పులి శేఖర్, కదిరి సంతోష్, కుక్కల శివ, ఉరివకిలి నర్సింహ, అముదాల మల్లికార్జున, అముదాల శేఖర్, గోనేపాటి రాంబాబు, శివరాత్రి రాజు తదితరులు పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా తేజో విజయకుమారి మాట్లాడుతూ, BCY పార్టీ వ్యవస్థాపకులు బోడె రామచంద్ర యాదవ్ బహుజన వర్గాల అభ్యున్నతి కోసం చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. అణగారిన వర్గాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో పార్టీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
నారగోని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, “బహుజనుల హక్కుల కోసం BCY పార్టీ పోరాటం చేస్తోంది. సామాన్య ప్రజలు రాజకీయంగా ఎదగాలంటే ఐక్యత అవసరం” అని అన్నారు. యువత, సామాజిక సేవకులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరడం ఆనందకరమని, భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.
పార్టీలో జరిగిన ఈ చేరికలతో GHMC పరిధిలో BCY పార్టీ బలపడిందని నాయకులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది యువ నాయకులు పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.
