
చైతన్యపురి, అక్టోబరు 18 (శ్రీరామ్ చక్రీ న్యూస్): చైతన్యపురి డివిజన్ పరిధిలోని ప్రభాత్నగర్లో అమ్మవారి పూజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైతన్యపురి మాజీ కార్పొరేటర్ జిన్నారం మిట్టల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను శాలువాతో సత్కరించారు. అమ్మవారిని పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో పవన్, గట్టు శ్రీను, సుధాకర్తో పాటు స్థానిక నాయకులు, మహిళలు, యువకులు, కాలనీవాసులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
