
శ్రీరామ్, చక్రీ న్యూస్, 26-09-2026, బాలాపూర్:‘స్వచ్ఛ్ హీ సేవా’ కార్యక్రమంలో భాగంగా స్లోక ది స్కూల్ విద్యార్థులు వినూత్న సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు, పాఠశాల సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని రోడ్లు, పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు.పరిశుభ్రత పాటించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటిని పొదుపుగా వినియోగించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ‘స్వచ్ఛత మన బాధ్యత–ప్రకృతి పరిరక్షణ మన కర్తవ్యం’ అనే సందేశాన్ని చేతల ద్వారా చాటిచెప్పారు.
పాఠశాల చైర్మన్ పి. కృష్ణారెడ్డి, వైస్ చైర్పర్సన్ పి. దీపా కృష్ణారెడ్డి కార్యక్రమాన్ని పరిశీలించి విద్యార్థులు, సిబ్బందిని అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, సేవాభావం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందుతుందని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.
